Telugu Global
Telangana

ఆ రైతు కూలీలనూ 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పథకంలోకి తీసుకోవాలి

4 వారాల్లో మున్సిపాలిటీల్లోని రైతు కూలీలను 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పథకంలోకి తీసుకోవాలని సీఎస్‌కు హైకోర్టు ధర్మాసనం ఆదేశం

ఆ రైతు కూలీలనూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలోకి తీసుకోవాలి
X

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాజ్యం దాఖలైంది. నారాయణపేట వాసి గవినోళ్ల శ్రీనివాస్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.భూమి లేని రైతు కూలీలకు రూ. 12 వేలు చెల్లించేలా ప్రభుత్వం పథకం రూపొందించిందని.. అయితే మున్సిపాలిటీల్లో ఉన్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని పిటిషనర్‌ పేర్కొన్నారు . రాష్ట్రంలో 129 మున్సిపాలిటీల్లో 8 లక్షలమందికిపైగా రైతు కూలీలు ఉన్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోర్టుకు తెలిపారు.. గ్రామాల్లో ఉన్న వారికి ఇచ్చి మున్సిపాలిటీల్లో ఉన్న వాళ్లకు ఇవ్వకపోవడం సరైందని కాదన్నారు. రైతు కూలీలు ఎక్కడ ఉన్నా అందరూ సమానమేనన్న అన్నారు. కేవలం గ్రామాల్లోని వారికే వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు 4 వారాల్లో మున్సిపాలిటీల్లోని రైతు కూలీలను 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పథకంలోకి తీసుకోవాలని హైకోర్టు సీజే ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది.

First Published:  27 Jan 2025 12:33 PM IST
Next Story