ఎలాంటి చర్చ లేకుండానే మూడు బిల్లులకు సభ ఆమోదం
విపక్ష సభ్యుల నిరసనల మధ్యే యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులకు ఆమోదం
BY Raju Asari17 Dec 2024 3:51 PM IST
X
Raju Asari Updated On: 17 Dec 2024 3:51 PM IST
తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్‌ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే శాసనసభ మూడు కీలక బిల్లులను ఆమోదించింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులకు ఆమోదం లభించింది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ మూడు బిల్లులకు సభ ఆమోదం తెలుపడం గమనార్హం. ప్రస్తుతం అసెంబ్లీలో రాష్ట్ర పర్యాటక విధానంపై చర్చ కొనసాగుతున్నది.
Next Story