Telugu Global
Telangana

రైతుబంధుకు కోతలు పెట్టే ఉద్దేశంలో ప్రభుత్వం

రైతుబంధు యథాతథంగా ఇస్తామంటే ఈ చర్చ ఎందుకు అని ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్‌

రైతుబంధుకు కోతలు పెట్టే ఉద్దేశంలో ప్రభుత్వం
X

రైతుబంధుకు కోతలు పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నదని, లేకపోతే .. పీఎంకిసాన్‌ సమ్మాన్‌ నిధి గురించి మంత్రి చెప్పేవారు కాదన్నన్నారు మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతుభరోసా విధివిధానాలపై అసెంబ్లీలో జరిగిన చర్చ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ 20 శాతం మంది రైతులకే వస్తున్నది. రైతుబంధు యథాతథంగా ఇస్తామంటే ఈ చర్చ ఎందుకు అని ప్రశ్నించారు. పత్తి, కంది 8 నెలల పంట. ఆర్థిక సాయం ఒక పంటకు ఇస్తారా? రెండు పంటలకు ఇస్తారా అనేది ప్రభు త్వం చెప్పాలని నిలదీశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 73 వేల కోట్లు జమ చేసిందని, ఒకసారి మాత్రమే రూ.7, 600 కోట్లు ఇచ్చామని మంత్రి తుమ్మల చెప్పారు.రూ. 21,283 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందని మంత్రి చెప్పారు. 2019-20 లో సాగు విస్తీర్ణం 141 లక్షల ఎకరాలని మంత్రి తెలిపారు. 2020-21లో సాగు విస్తీర్ణం 2024 లక్షల ఎకరాలని నివేదికలో ఉన్నది. రైతు బంధు ఇవ్వడం వల్లనే సాగు విస్తీర్ణం 2 కోట్ల ఎకరాలకు పెరిగింది. సాగు విస్తీర్ణం పెరగాలనే ఉద్దేశంతోనే రైతుబంధు ఇచ్చాం. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఇచ్చిన నోట్‌ స్పష్టం చేస్తున్నది. ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టం కింద 4.50 లక్షల మంది గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం. పోడు పట్టాలున్న గిరిజనులకు రైతు బంధు ఇస్తారో.. లేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పత్తి, కంది రైతులకు ఒకే పంటకు రైతుబంధు ఇచ్చేలా ఇచ్చిన నోట్‌ లో ఉన్నది. పత్తి, కంది రైతులకు రెండు పంటలకు రైతు బంధు ఇస్తారా లేదా అనేది చెప్పాలని ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రైతుభరోసాపై ఎలాంటి నిర్ణయం చేయలేదన్నారు. మేం ఇచ్చిన నోట్‌లో ఏమీ చెప్పలేదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన విధివిధానాలే సభ ముందు ఉంచామన్నారు. బీఆర్‌ఎస్‌ ఏది చెబితే .. అది అమలుచేయాలనే ఆలోచన వారికి ఉన్నదని విమర్శించారు. ఏ పంటకు ఎంత ఇస్తామన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. సభలో సభ్యుల సూచనల తర్వాతే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. పత్తి, చెరుకు కు ఏం చేయాలనేది సభ్యులు చెబితే.. చర్చించి నిర్ణయిస్తామన్నారు. రైతుబంధులో కోతలు విధిస్తామని మేం చెప్పలేదన్నారు. ప్రజలు, సభ్యులు అభిప్రాయం ప్రకారం విధివిధానాలు నిర్ణయిస్తామన్నారు.

First Published:  21 Dec 2024 11:25 AM IST
Next Story