Telugu Global
Telangana

ధర్మరక్షకులు దాడులు చేస్తారు.. రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు

దాడి ఘటన వీడియోలున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నదని? ప్రశ్నించిన కేటీఆర్‌

ధర్మరక్షకులు దాడులు చేస్తారు.. రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు
X

చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఈ ఘటనకు సీఎం రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ధర్మరక్షకులు దాడులు చేస్తారు.. రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రంగరాజన్‌పై దాడి గురించి హిందు ధర్మ పరిరక్షకులు ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. దాడి ఘటన వీడియోలున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నదని? ప్రశ్నించారు. ఇది సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉన్న సమయంలో తనపై దాడి చేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 7న తన కుమారుడు రంగరాజన్‌పై కొందరు బెదిరింపులకు పాల్పడినట్లు సౌందర్‌ రాజన్ తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై తన కుమారుడు రంగరాజన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సౌందర్‌ రాజన్ వెల్లడించారు.

First Published:  10 Feb 2025 10:24 AM IST
Next Story