Telugu Global
Telangana

పెద్దపల్లి, ఏటూరునాగారం డిపోలకు నిధులు

ఆర్టీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం

పెద్దపల్లి, ఏటూరునాగారం డిపోలకు నిధులు
X

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే బస్‌ డిపోలకు నిధుల కేటాయింపు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శనివారం బస్ భవన్‌ లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఆర్టీసీ బోర్డు సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోయే డిపో నిర్మాణానికి రూ.11.70 కోట్లు కేటాయించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం డిపో నిర్మాణానికి రూ.6.28 కోట్లు, ములుగు జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్‌ నిర్మాణానికి రూ.5.11 కోట్లు, ఖమ్మం జిల్లా మధిరలో కొత్త బస్టాండ్‌ నిర్మాణానికి రూ.10 కోట్లు విడుదల చేశారు. పెద్దపల్లిలోని మంథని బస్టాండ్‌ విస్తరణకు రూ.51 లక్షలు, ములుగు జిల్లా మంగపేట బస్టాండ్‌ నిర్మాణానికి రూ.51 లక్షలు, సూర్యాపేట జిల్లా కోదాడలో బస్టాండ్‌ నిర్మాణానికి రూ.17.95 కోట్లు కేటాయించారు. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరంలో కొత్త బస్టాండ్‌ నిర్మాణానికి రూ.3.95 కోట్లు కేటాయించారు. సమావేశంలో టీజీఎస్‌ఆర్టీసీ సీఎండీ సజ్జనార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

First Published:  18 Jan 2025 4:32 PM IST
Next Story