Telugu Global
Telangana

రేపు కేబినెట్ సమావేశం

కొత్త రెవెన్యూ చట్టం సహా పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం

రేపు కేబినెట్ సమావేశం
X

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ బిల్డింగ్ లోని కమిటీ హాల్ - 1లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం సహా పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశ పెట్టనున్నారు. మంగళవారమే ఈ బిల్లు అసెంబ్లీ ముందుకు రావొచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

First Published:  15 Dec 2024 11:08 PM IST
Next Story