Telugu Global
Telangana

హైకోర్టులో నలుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

జస్టిస్‌ రేణుకా యారా, జస్టిస్‌ నందికొంద నర్సింగ్‌రావు, జస్టిస్‌ ఇ. తిరుమలదేవి, జస్టిస్‌ బి.ఆర్‌. మధుసూదన్‌రావులతో ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే

హైకోర్టులో నలుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
X

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన నలుగురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ రేణుకా యారా, జస్టిస్‌ నందికొంద నర్సింగ్‌రావు, జస్టిస్‌ ఇ. తిరుమలదేవి, జస్టిస్‌ బి.ఆర్‌. మధుసూదన్‌రావులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ ప్రమాణం చేయించారు.

ఇంతకుముందు రేణుక యారా సిటీ సివిల్‌ కోర్ట చీఫ్‌ జడ్జిగా, నందికొంద నర్సింగ్‌ రావు సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, ఇ. తిరుమలాదేవి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌, విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌గా, బి.ఆర్‌. మధుసూదన్‌రావు హైకోర్టు రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌) గా బాధ్యతలు నిర్వర్తించారు. 42 మంది న్యామూర్తులు ఉండాల్సిన తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతంం 26 మంది సేవలు అందిస్తున్నారు. తాజాగా నలుగురి నియామకంతో ఆ సంఖ్య 30కి చేరింది.

First Published:  25 Jan 2025 11:49 AM IST
Next Story