ఖోఖో ఆడుతూ విద్యార్థి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం
BY Naveen Kamera23 Jan 2025 4:45 PM IST

X
Naveen Kamera Updated On: 23 Jan 2025 4:45 PM IST
రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహిస్తున్న ఆటలపోటీల్లో తన స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఆడుకుంటున్న ఓ చిన్నారి అంతలోనే ఈలోకాన్ని వీడాడు. తల్లిదండ్రులకు గర్భశోఖాన్ని మిగిల్చి వెళ్లిపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో రిపబ్లిక్ డే సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థి బన్నీ తన స్నేహితులతో కలిసి ఖోఖో ఆడుతున్నాడు. ఈ క్రమంలో పరుగుత్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆందోళనకు గురైన టీచర్లు వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే బన్నీ మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. బన్నీకి గతంలో గుండె సంబంధిత సమస్య తలెత్తగా డాక్టర్లు స్టెంట్లు వేశారని గ్రామస్తులు తెలిపారు. బన్నీ మృతితో భీంపూర్ లో తీవ్ర విషాదం అలుముకుంది.
Next Story