డిమాండ్లు పరిష్కరించకుంటే ఫిబ్రవరి 9 నుంచి సమ్మె
యాజమాన్యానికి ఆర్టీసీ కార్మిక సంఘాల నోటీసులు
BY Naveen Kamera27 Jan 2025 5:16 PM IST
X
Naveen Kamera Updated On: 27 Jan 2025 5:16 PM IST
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే ఫిబ్రవరి 9వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. ఈమేరకు సోమవారం టీజీఎస్ ఆర్టీసీ సీఎండీ సజ్జనార్‌కు కార్మిక సంఘాల నాయకులు నోటీసులు అందజేశారు. సమ్మె నోటీసు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు బస్ భవన్‌కు తరలి రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పెండింగ్‌లో రెండు పీఆర్సీలు, సీసీఎస్, ప్రభుత్వం ఉపయోగించుకున్న పీఎఫ్ డబ్బు రూ.2,700 కోట్లు తిరిగి చెల్లింపు సహా తమ ఇతర డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. గడువులోగా డిమాండ్లు నెరవేర్చకుంటే ఫిబ్రవరి 9వ తేదీ నుంచి సమ్మె తప్పదని తేల్చిచెప్పారు.
Next Story