విదేశీయుల దండయాత్ర లెక్కనే రేవంత్!
తెలంగాణ చరిత్ర, ఉద్యమంపై దాడి చేస్తున్నడు : దాసోజు శ్రవణ్
పూర్వకాలంలో విదేశీయులు దండయాత్ర చేసి దేవతా విగ్రహాలను విధ్వంసం చేసినట్టు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదే పంథాలో పయనిస్తూ తెలంగాణ చరిత్ర, ఉద్యమ చిహ్నాలపై దాడి చేస్తున్నాడని బీఆర్‌ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. 'ఎక్స్' వేదికగా రేవంత్ సీఎం అయిన తర్వాత తెలంగాణ చరిత్ర, ఉద్యమ చిహ్నాలపై ఎలా దాడి చేస్తున్నాడో వివరించారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి విధ్వంసం చేస్తున్నాడని మండిపడ్డారు. ''కాకతీయ కళాతోరణంపై కుల వివక్ష చూపిస్తుండు.. చార్మినార్ ఆనవాళ్లను చెరిపివేయాలనే కుట్రలు చేస్తుండు.. బాబాసాహెబ్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించాడనే కోపంతో అవమానిస్తునుండు..'' అని వివరించారు. రేవంత్ తీరును భర్తృహరి పద్యం ద్వారా వివరించారు.
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
- భర్తృహరి