భారతీయ జనతా పార్టీ ఇటీవల జిల్లా అధ్యక్షులను నియమించింది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌కు సంబంధించి గోల్కొండ జిల్లా అధ్యక్షడి నియామకంపై తాను చెప్పిన వారికి కాకుండా వేరే వారి పేరు ప్రకటించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఒక మంచి కార్యకర్త పేరు పంపిస్తే దాన్ని పక్కనపెట్టడం ఏమిటని పార్టీ హైకమాండ్‌ను ప్రశ్నించారు. పార్టీకి తన అవసరం లేదని తాను అనుకుంటున్నానని.. మునుముందు బలం ఏమిటో చూపెడుతామని ఆడియో విడుదల చేశారు.