పేరుకే ప్రజాపాలన.. మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు
పోలీసుల ముందే మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై మంత్రి అనుచరులు దాడి చేశారని కేటీఆర్ ఆరోపణ
పేరుకే ప్రజాపాలన.. దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్'లో పోస్టు పెట్టారు. బీఆర్‌ఎస్‌కు భయపడి రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు ఫ్లెక్సీలు చింపి, ఏకంగా ఒక ప్రభుత్వ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యేను బూతులు తిడుతూ పోలీసుల ముందే దాడికి పాల్పడ్డారు.
పోలీసుల ముందే మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై మంత్రి అనుచరులు దాడి చేశారని కేటీఆర్ ఆరోపించారు. వారు దాడి చేస్తే భూపాల్‌రెడ్డిని అరెస్టు చేశారని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై మాత్రం చర్యలు లేవని.. ఇదీ కాంగ్రెస్ అరాచక పాలన తీరు అని ధ్వజమెత్తారు. కంచర్ల భూపాల్‌రెడ్డిపై పాశవిక దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధ్యులపై కేసు నమోదు చేయాలని డీజీపీనని కేటీఆర్ కోరారు.