Telugu Global
Telangana

ఎప్‌ సెట్‌ కన్వీనర్‌గా డీన్‌ కుమార్‌

తెలంగాణ సెట్స్‌ కన్వీనర్లను ప్రకటించిన ఉన్నత విద్యామండలి

ఎప్‌ సెట్‌ కన్వీనర్‌గా డీన్‌ కుమార్‌
X

తెలంగాణ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ -2025 కన్వీనర్లను మంగళవారం ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇంజనీరింగ్‌, ఫార్మాసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్‌సెట్‌ (టీజీ ఈఏపీసీఈటీ) ను జేఎన్‌టీయూ నిర్వహించనుంది. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ సివిల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ డీన్‌ కుమార్‌ ఎప్‌సెట్‌ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఇంజనీరింగ్‌, ఫార్మాసీ, ఆర్కిటెక్షర్‌, ఫార్మా -డీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల ప్రవేశ పరీక్ష (టీజీ పీజీఈసెట్‌) ను జేఎన్‌టీయూ నిర్వహించనుంది. పీజీఈ సెట్‌ కన్వీనర్‌గా కూకట్‌పల్లి జేఎన్‌టీయూ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎ. అరుణ కుమారిని నియమించారు. నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ టీజీ ఐసెట్‌ నిర్వహిస్తుంది.. వర్సిటీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెసర్‌ అలువాల రవిని కన్వీనర్‌గా నియమించారు. టీజీ ఈసెట్‌ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది.. ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పి. చంద్రశేఖర్‌ ను ఈసెట్‌ కన్వీనర్‌గా నియమించారు. లా సెట్‌ ప్రవేశ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.. వర్సిటీ లా కాలేజీ డీన్‌ ప్రొఫెసర్‌ బి. విజయలక్ష్మీని కన్వీనర్‌ గా నియమించారు. ఎడ్‌ సెట్‌ ప్రవేశ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ బి. వెంకట్రామ్‌ రెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సెట్‌ను పాలమూరు యూనివర్సిటీ నిర్వహించనుంది.. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.ఎస్‌. దిలీప్‌ ను కన్వీనర్‌గా నియమించారు.





First Published:  17 Dec 2024 5:59 PM IST
Next Story