పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు
బీఆర్‌ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు
బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కీలక పరిణామం చోటు చేసుకున్నది. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. వీరిపై అనర్హత వేటు వేయాలని అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్‌ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపారు. అయతే అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదంటూ బీఆర్‌ఎస్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు రెండు రోజుల కిందట ఇంకా ఎంతకాలం సమయం తీసుకుంటారని శాసనసభ కార్యదర్శి తరఫున హాజరైన ముకుల్ రోహత్గీని ప్రశ్నించిన విషయం విదితమే.ఈ కేసుతో పాటు ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పై కేటీఆర్ వేసిన పిటిషన్‌పై ఈ నెల 10న విచారిస్తామని చెప్పింది. ఈ పరిణామాల శాసనసభ కార్యదర్శి 10 మంది శాసనసభ్యులకు నేడు నోటీసులు పంపారు. వారిపై అనర్హత వేటు ఎందుకు వేయకూడదో బీఆర్‌ఎస్ పిటిషన్‌పై వారి నుంచి వివరణ కోరారు. దీనిపై స్పందించి కొందరు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడానికి కొంత సమయం కావాలని లిఖిత పూర్వకంగా శాసనసభ కార్యదర్శిని ఎమ్మెల్యేలు కోరినట్టు సమాచారం.