Telugu Global
Telangana

మైనింగ్‌ వద్దు.. గుట్ట ముద్దు నినాదంతో నిరాహారదీక్షలు

రైతుల అరెస్ట్‌.. గ్రామంలోకి పోలీసులు రాకుండా ముళ్ల కంచె వేసిన స్థానికులు

మైనింగ్‌ వద్దు.. గుట్ట ముద్దు నినాదంతో నిరాహారదీక్షలు
X

నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం మైలారంలో స్థానికులు ఆందోళనకు దిగారు. మైనింగ్‌ వద్దు.. గుట్ట ముద్దు అనే నినాదంతో రైతులు నేటి నుంచి రిలే నిరాహారదీక్షలకు సిద్ధమయ్యారు. దీంతో ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను పోలీసులు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. తమ గ్రామాలకు చెందిన రైతులను అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. వారిని వెంటనే విడుదల చేయాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. పెద్ద ఎత్తున మహిళలు, రైతులు రోడ్డుపైకి చేరి నిరసనకు దిగారు అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాని హెచ్చరించారు. పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మరోవైపు మైలారంలో స్థానికులకు మద్దతు తెలిపడానికి పౌరహక్కుల నేతలు ప్రొఫెసర్‌ హరగోపాల్‌, గడ్డం లక్ష్మణ్‌ హైదరాబాద్‌ నుంచి బయల్దేరి వచ్చారు. వారిని వెల్దండ వద్ద పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు.

First Published:  20 Jan 2025 11:53 AM IST
Next Story