Telugu Global
Telangana

మినిస్టర్ క్వార్టర్స్‌ వద్ద వీఆర్‌ఏల ధర్నా

మినిస్టర్ క్వార్టర్స్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తం. ఆందోళనకు దిగిన వారిని అరెస్టు చేసిన పోలీసులు

మినిస్టర్ క్వార్టర్స్‌ వద్ద వీఆర్‌ఏల ధర్నా
X

హైదరాబాద్‌ మినిస్టర్ క్వార్టర్స్‌ వద్ద వీఆర్‌ఏలు ధర్నాకు దిగారు. వీఆర్‌ఏ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని నిరసన వ్యక్తం చేశారు. మినిస్టర్ క్వార్టర్స్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 3797 మంది వీఆర్ఏలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 15 నెలలుగా ఎదురుచూస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నిరసనకు దిగారు. మంత్రిని కలవడానికి అనుమతి ఇవ్వడం లేదని రోడ్డుపైనే వీఆర్ఏలు బైఠాయించారు. ఈ క్రమంలోనే మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోకి వీఆర్ఏలు దూసుకెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతోపోలీసులకు, వీఆర్ఏలకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకు దిగిన కొందరిని పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. తమ సమస్యలపై మంత్రవర్గ భేటీలో వీఆర్‌ఏలు డిమాండ్‌ చేశారు. రోడ్డు పక్కన నిల్చున్న వృద్ధుడిని అరెస్ట్ చేసి పోలీసులు గుంజుకుపోయారు. సర్ నాకు ఏం తెల్వదని కాళ్లు పట్టుకున్నా కూడా కనికరించకుండా పోలీసులు గుంజుకుపోయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.





First Published:  4 Feb 2025 10:29 AM IST
Next Story