ఇక్కడి హామీలకే దిక్కులేదు.. అక్కడ గ్యారెంటీలు ఇస్తున్నవా?
నవ్విపోదురు గాక .. నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం. జాగో ఢిల్లీ జాగో అని కేటీఆర్ ట్వీట్
తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉన్నది రేవంత్ సర్కార్ తీరు. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణ నికృష్ట పాలన సాగిస్తూ.. ఢిల్లీలోనూ చేయిస్తానని పులకేశి (రేవంత్‌ను ఉద్దేశించి) బయలుదేరాడిన సెటైర్ వేశాడు. ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ ఎవరికి ఇచ్చిరని ప్రశ్నించారు రూ. 2,500 తీసుకున్న మహిళలు వెరు? తులం బంగారం ఆగబిడ్డలు ఎవరని నిలదీశారు. రైతు భరోసా రూ. 7,500 ఇచ్చింది ఎక్కడ? పింఛన్ రూ. 4 వేలు చేసింది ఎక్కడ అని కేటీఆర్ మండిపడ్డారు. రూ. 5 లక్షల విద్యా భరోసా ఎక్కడ? విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ? పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు రాష్ట్రంలో ఇచ్చిన హామీలకు దిక్కలేదు.. ఢిల్లీలో గ్యారెంటీలు ఇస్తున్నవా? ఢిల్లీ గల్లిల్లో కాదు.. దమ్ముంటే మీ ఢిల్లీ గులాం తో ఉద్యోగాలు ఇచ్చామని అశోక్‌నగర్ గల్లీలో చెప్పాలి. నవ్విపోదురు గాక .. నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం. జాగో ఢిల్లీ జాగో అని కేటీఆర్ రాసుకొచ్చారు.