Telugu Global
Telangana

జగిత్యాల ఎమ్మెల్యేనే నాపై దాడి చేశారు

తన మీద మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు జగిత్యాల సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కన్ సింగ్ ఠాకూర్ చేసిన దాడిని వీడియో క్లిప్‌ ద్వారా బైటపెట్టిన కౌశిక్‌రెడ్డి

జగిత్యాల ఎమ్మెల్యేనే నాపై దాడి చేశారు
X

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తనపై దాడి చేశారన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ఆరోపించారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా సమీక్షా సమావేశంలో జరిగిన ఘటనపై ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆయనకు బెయిల్‌కూడా లభించింది. అయితే ఆ రోజు ఏం జరిగిందనేది కౌశిక్ రెడ్డి బీఆర్‌ఎస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బైటపెట్టారు.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద నేను దాడి చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. అది వాస్తవం కాదని, దీనిపై నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నట్లు చెప్పారు. సంజయ్‌ నా మీద దాడి చేసిండు తప్ప నేను ఆయనపై దాడి చేయలేదన్నారు. నా పక్కన కూర్చొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏమన్నారంటే ఇప్పుడు మీ బీఆర్ఎస్ బట్టలు ఎలా విప్పుతానో చూడు అన్నారు. ఆ తర్వాత ఆయనకు మైకు ఇచ్చినప్పుడు ఆయన ఏ పార్టీకి చెందినవారు ఆయనకు దీంతో ఏం సంబంధం అని నేను ప్రశ్నించాను. అప్పుడు సంజయ్‌ నా ఛాతి మీద చెయ్యి పెట్టి ఎలా దాడి చేస్తున్నారు చూడొచ్చు అని కౌశిక్ రెడ్డి ఫొటో క్లిప్ ను ప్రదర్శించారు . దీంతోపాటు కౌశిక్ రెడ్డి ఒక నిమిషం వీడియోను ప్రదర్శించారు . తన మీద మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు జగిత్యాల సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కన్ సింగ్ ఠాకూర్ చేసిన దాడిని వీడియో ఆధారాలతో బయటపెట్టారు. సంజయ్‌ ఎలా తనను నెట్టిస్తున్నారో, మానకొండూర్‌ ఎమ్మెల్యే సత్యనారయణ ఎలా నా కాలర్‌ పట్టుకుని గుంజుతున్నారో, మక్కాన్‌ సింగ్‌ నా ప్యాంట్‌లో చేయి పెట్టి ఎలా గుంజుతున్నారో చూడొచ్చు అన్నారు. అలాగే మంత్రి శ్రీధర్‌బాబు వేలు చూపెట్టి బెదిరించారన్నారు. ముగ్గురు మంత్రుల సమక్షంలో పోలీసులు నా మీద ఎలా దాడి చేశారు? నేను ఏ విధంగా కిందపడ్డానో ఆ వీడియోలో చూడవచ్చుని చెప్పారు. తెలంగాణ ప్రజలంతా చూడాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు వీడియో ద్వారా చూడొచ్చని కౌశిక్ రెడ్డి వీడియో ప్రదర్శించి చూపెట్టారు.

భువనగిరిలో మా పార్టీ కార్యాలయం పైన దాడి చేసి, కేసీఆర్ ఫొటోను నేలకేసి కొట్టేందుకు ఎన్ని గుండెలు రా మీకు రేవంత్ అని కౌశిక్‌ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చాడు కాబట్టే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు..లేకపోతే చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతూ కూర్చునేవాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫొటోను నేలకేసి కొడుతుంటే గుండెల్లో బుల్లెట్ గుచ్చుకుంది అనిపించిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.

First Published:  15 Jan 2025 6:19 PM IST
Next Story