Telugu Global
Telangana

సభను తప్పుదోవ పట్టిస్తున్నహరీశ్‌

అప్పులపై అసెంబ్లీలో హరీశ్‌, భట్టిల మధ్య తీవ్ర వాగ్వాదం

సభను తప్పుదోవ పట్టిస్తున్నహరీశ్‌
X

హరీశ్ రావు శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఏడాదిలోనే రూ. 1.27 లక్షల కోట్ల అప్పు చేసిందన్న ఆరోపణలను ఆయన ఖండించారుఈ సందర్భంగా హరీశ్‌, భట్టి మధ్య వాదన కొసాగింది. అనంతరం భట్టి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రజలకు వాస్తవాలు తెలియాలనే సభలో శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి అప్పులు చేయడం లేదని చెప్పారు. స్పీకర్‌ అనుమతితో అప్పులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో హరీశ్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యదూరమైన మాటలతో ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేయవద్దని సూచించారు. సభను తప్పుదో పట్టించవద్దు అన్నారు. గత ప్రభుత్వ లోపాలను ప్రజలకు తెలియజేయడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇచ్చారా? తీసుకునే అప్పుల విషయంలో మేం దాచుకోకుండా చెప్పామని, మీరు మాత్రం అప్పట్లో దాచిపెట్టారని విమర్శించారు.

మాకే నీతులెందుకు చెబుతున్నారంటూ స్పీకర్‌ను ఉద్దేశించి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై భట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభాపతిని శాసించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. బీఏసీ సమావేశంలో హరీశ్‌రావు లేచి కాగితాలు పడేసి బైటకి వెళ్లారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు ఏ నిబంధనలు పాటించారో ఇప్పుడూ అవే పాటించాలి కదా? అని ప్రశ్నించారు. సభ ఎన్ని రోజులు నిర్వహించానే దానిపై సభాపతి నిర్ణయం తీసుకుంటారని బీఆర్‌ఎస్‌ హయాంలో మాకు చెప్పారు. ఇప్పుడు ఎందుకు దాన్ని పాటించరు? అని నిలదీశారు. సభాపతి స్థానాన్ని అందరూ గౌరవించాలని, నియమాల ప్రకారం నడుచుకోవాలని భట్టి సూచించారు.

అనంతరం హరీశ్‌రావు స్పందిస్తూ.. రూల్స్‌ బుక్‌ ఆధారంగానే తాను మాట్లాడినట్లు చెప్పారు. సభను తప్పుదోవ పట్టించేందుకు భట్టి విమర్శలు చేశారన్నారు. అప్పులపై ఈ సమావేశాల్లోనే చర్చకు అనుమతించాలని స్పీకర్‌ను కోరారు.

First Published:  17 Dec 2024 12:11 PM IST
Next Story