వర్గీకరణలో లోపాలపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వండి
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ లేఖ
BY Naveen Kamera10 Feb 2025 7:46 PM IST
X
Naveen Kamera Updated On: 10 Feb 2025 7:46 PM IST
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కొన్ని లోపాలు ఉన్నాయని.. వాటిపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కోరారు. సోమవారం ఈమేరకు ముఖ్యమంత్రికి మంద కృష్ణ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికలోని లోపాలతో మాదిగలతో పాటు మరికొన్ని దళిత కులాలు తమ హక్కులు, వాటా, అస్తిత్వం, భవిష్యత్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా అంశాలపై చర్చించడానికి, తమ విజ్ఞప్తులు, సూచనలు తెలియజేయడానికి అపాయింట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా తమకు అపాయింట్ ఇవ్వాలని లేఖలో కోరారు.
Next Story