Telugu Global
Telangana

మైసిగండి అమ్మవారికి కేటీఆర్‌ పూజలు

కల్వకుర్తి పర్యటనలో భాగంగా మొక్కులు

మైసిగండి అమ్మవారికి కేటీఆర్‌ పూజలు
X

కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండి అమ్మవారికి బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఆమనగల్‌ లో నిర్వహిస్తున్న రైతు దీక్షకు వెళ్తోన్న సందర్భంలో పార్టీ నాయకులతో కలిసి మైసిగండి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.

First Published:  18 Feb 2025 4:37 PM IST
Next Story