రేవంత్‌కు కార్మికుల ప్రాణాల కంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమే ముఖ్యమా?
ఈ దుర్ఘటనపై బీఆర్‌ఎస్ రాజకీయాలు చే యడం లేదన్నారు. ముఖ్యమంత్రే ఓట్ల కోసం బయలుదేరి రాజకీయాలు చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి ధ్వజం

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్‌లోనే చిక్కుకున్నారని తెలిపారు. వారి ప్రాణాలన కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టన్నెల్‌లో చిక్కుకున్న వారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే అయినప్పటికీ.. తెలంగాణ పునర్ నిర్మాణంలో బైటి రాష్ట్రాల కార్మికుల పాత్ర ఎంతో ఉందన్నారు. తెలంగాణలో సుమారు 35 లక్షల మంది బైటికి కార్మికలు పనిచేస్తున్నారు. కొవిడ్ సమంలో కేసీఆర్ మన రాష్ట్రం వారా.. పరాయి రాష్ట్రం వారా అనేది చూడలేదని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కడా అదే విధంగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఉన్న ఇతర కార్మికుల ప్రాణాలను రక్షించడం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. కార్మికులను రక్షించడంలో, చేయాల్సిన పనులు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు.
సీఎం రేవంత్‌కు కార్మికుల ప్రాణాల కంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమే ముఖ్యమైందని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి మానవత్వం లేదని మండిపడ్డారు. మంత్రులకు ఫొటోలపై ఉన్న శ్రద్ధ.. కార్మికుల ప్రాణాలను కాపాడటంలో లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీఎం రేవంత్ ప్రవర్తన అత్యంత అభ్యంతరకరంగా ఉందన్నారు. టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల ప్రాణాల గురించి తెలంగాణ ప్రలజు ఆతృతగా ఆరా తీస్తున్నారని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తోలుమందంతో వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటనపై బీఆర్‌ఎస్ రాజకీయాలు చే యడం లేదన్నారు. ముఖ్యమంత్రే ఓట్ల కోసం బయలుదేరి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్లలేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రధాని మోడీతో సీఎం మాట్లాడారని చెప్పారు తప్పా.. మోడీని రక్షణ చర్యల గురించి అడిగినట్లు ఎక్కడా వెల్లడించలేదని అన్నారు. మీడియాకు రకరకాల లీకులు ఇస్తున్నారు గానీ.. అసలు వాస్తవాలు ఏమిటో వెల్లడించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.