మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపే అవకాశమివ్వరా?
సీఎం రేవంత్ రెడ్డికి మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి బహిరంగ లేఖ
BY Naveen Kamera31 Dec 2024 3:54 PM IST
X
Naveen Kamera Updated On: 31 Dec 2024 3:54 PM IST
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలిపేందుకు శాసన మండలికి అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని మండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. భారత రాజకీయాల్లో మన్మోహన్ సింగ్ మూడు దశాబ్దాలకు పైగా పెద్దల సభ (రాజ్యసభ)కు ప్రాతినిథ్యం వహించారని, అలాంటి మహోన్నత నాయకుడికి తెలంగాణలో పెద్దల సభ (శాసన మండలి)కు అవకాశం కల్పించకపోవడం సరికాదన్నారు. శాసన మండలికి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలిపితే సముచితంగా ఉండేదన్నారు. ఇది తన ఒక్కరి అభిప్రాయం కాదని.. శాసన మండలి హృదయ వేదన అని వివరించారు. శాసన మండలిని చిన్నచూపు చూడటం మంచిది కాదన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Next Story