Telugu Global
Telangana

ఖాజా గూడ చెరువులో హైడ్రా కూల్చివేతలు

చెరువు బఫర్‌జోన్‌లోని నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బంది

ఖాజా గూడ చెరువులో హైడ్రా కూల్చివేతలు
X

ఖాజా గూడ భగీరథమ్మ చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. చెరువు బఫర్‌జోన్‌లోని నిర్మాణాలను కూల్చివేశారు. ఇటీవల ఈ చెరువును హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పరిశీలించారు. కూల్చివేతల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఈ ఏడాది ముగింపు రోజు కూల్చివేతలతో హైడ్రా హడలెత్తిస్తున్నది. ఖాజాగూడ చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్నది. హైడ్రా చర్యలపై బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటు బాధితుల ఆందోళ చేస్తున్నారు. హడావుడిగా కూల్చివేతలు చేసి మమ్మల్ని రోడ్డుమీద పడేశారు అంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా సిబ్బంది 20కి పైగా దుకాణాలను తొలగించింది. నోటీసు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు మండిపడుతున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగుతున్నది. సామాన్లతో పాటు కూల్చివేతలు చేస్తున్నారని, దుకాణాల్లో ఫ్రిజ్ లు, టీవీలు, విలువైన సామాగ్రి ధ్వంసమయ్యాయని బాధితులు ఆరోపిస్తున్నారు.

First Published:  31 Dec 2024 11:54 AM IST
Next Story