అల్కాపురి టౌన్‌షిప్‌లో హైడ్రా చర్యలు చేపట్టింది. మార్నింగ్ రాగా అపార్ట్‌మెంటులో నిబంధనలకు విరుద్ధంగా షట్టర్లు వేసి దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు షటర్లను తొలిగించారు. హైడ్రా, పోలీసులను మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్ వాసులు అడ్డుకున్నారు. గత నెల 27న మణికొండ మున్సిపల్ అధికారులు ఇక్కడి వారికి నోటీసులు ఇచ్చారు. ఏడు రోజుల్లో షట్టర్లు తొలిగించాలని అందులో పేర్కొన్నారు. నోటీసులకు స్పందించకపోవడంతో తాజాగా గురువారం షట్టర్లను తొలిగించారు. దీనికి హైడ్రా సాయం తీసుకున్నారు.
Previous Articleజమ్మూశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
Next Article కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదు
Keep Reading
Add A Comment