ఆదాయం కన్నా హైదరాబాద్ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం
గ్రీన్ తెలంగాణ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టి

ఆదాయం కన్నా హైదరాబాద్ ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం నోవాటెల్ హోటల్‌లో ఐజీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ తెలంగాణ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, నగరంలోని డీజిల్ వాహనాలను దశలవారీగా ఎలక్ట్రిక్‌గా మారుస్తామన్నారు. ఫ్యూచర్ సిటీని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. మూసీని పునరుజ్జీవింపజేస్తామని తెలిపారు. హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు విధాన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. బిల్డర్స్‌కు హైదరాబాద్ స్వర్గధామమని.. బిల్డర్స్‌కు తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించామని, గతంలో ఎప్పుడూ ఇంత బడ్జెట్ పెట్టలేదన్నారు. బిల్డర్స్ సంపద సృష్టికర్తలని.. రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యంతో ఎంతో కీలకమన్నారు. బిల్డర్స్, డెవలపర్స్ పై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.