Telugu Global
Telangana

ఏసీబీ విచారణను మానిటరింగ్‌ చేస్తున్న హరీశ్‌ రావు

తెలంగాణ భవన్‌ లో సీనియర్‌ నేతలతో భేటీ

ఏసీబీ విచారణను మానిటరింగ్‌ చేస్తున్న హరీశ్‌ రావు
X

ఫార్ములా -ఈ రేస్‌ కేసులో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ను ఏసీబీ విచారిస్తున్న నేపథ్యంలో మరో సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలంగాణ భవన్‌ నుంచి విచారణ తీరును మానిటరింగ్‌ చేస్తున్నారు. నందినగర్‌ నివాసం నుంచి కేటీఆర్‌ తో పాటే బయల్దేరిన హరీశ్‌ రావు తెలంగాణ భవన్‌ కు చేరుకున్నారు. కేటీఆర్‌ ఏసీబీ ఆఫీస్‌ కు వెళ్లారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేల పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, పాడి కౌశిక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేల ఇతర నేతలతో హరీశ్ రావు సమావేశమయ్యారు. విచారణ జరుగుతున్న తీరును మీడియాతో పాటు ఇతర సోర్సుల ద్వారా ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షిస్తున్నారు.

First Published:  9 Jan 2025 11:34 AM IST
Next Story