Telugu Global
Telangana

ఏప్రిల్‌ తర్వాత మళ్లీ గ్రూప్‌ -1, 2 నోటిఫికేషన్లు

టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం

ఏప్రిల్‌ తర్వాత మళ్లీ గ్రూప్‌ -1, 2 నోటిఫికేషన్లు
X

కొత్త ఏడాదిలో నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్‌ న్యూస్‌ చెప్పబోతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత కొత్తగా మళ్లీ గ్రూప్స్‌ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఈ విషయాన్ని టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం తెలిపారు. గ్రూప్‌ -1, 2తో పాటు గ్రూప్‌ -3 నోటిఫికేషన్లు కూడా ఇస్తామని తెలిపారు. ఇప్పుడు జరుగుతోన్న నియామక ప్రక్రియను ఈ ఏడాది మార్చి నెలాఖరులోపు దాదాపు పూర్తి చేస్తామన్నారు. ఈ నెలలోనే గ్రూప్‌ -1, 2, 3 ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి నియామక ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.

First Published:  8 Jan 2025 5:01 PM IST
Next Story