కాంగ్రెస్, బీజేపీలకూ గ్రీన్‌కో ఎన్నికల బాండ్లు
పార్లమెంటు ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నించిన కేటీఆర్
గ్రీన్‌కో ఎన్నికల బాండ్ల అంశంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గ్రీన్ కో సంస్థ 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చిందని చెప్పారు. 2023లో ఫార్ములా ఈ-రేస్ జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు కూడా గ్రీన్‌కో బాండ్లు ఇచ్చిందన్నారు. ఫార్ములా ఈ-రేసు కారణంగా గ్రీన్‌కో నష్టపోయిందని వివరించారు. పార్లమెంటు ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్నిపార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధమని కేటీఆర్ అన్నారు.
అంతకుముందు ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలకాంశాలను బైటపెట్టింది. రేస్ నిర్వహించిన గ్రీన్‌కో సంస్థ ద్వారా బీఆర్‌ఎస్‌కు రూ. కోట్లలో లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ. 41 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రీన్‌కో, అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నట్లు వెల్లడించింది. 2022 ఏప్రిల్ 8-అక్టోబర్ 10 మధ్య కొన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది.