'జీవో 317' బదిలీలు నెలాఖరులోగా పూర్తి చేయండి
అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం
BY Naveen Kamera14 Feb 2025 6:46 PM IST

X
Naveen Kamera Updated On: 14 Feb 2025 6:46 PM IST
రాష్ట్ర విభజన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు తెచ్చిన జీవో 317తో ఇబ్బంది పడుతున్న వారి మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియ ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని అన్ని శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు శుక్రవారం అన్ని శాఖలకు నోట్ జారీ చేసింది. జీవో 317తో పాటు, స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ గ్రౌండ్స్‌లో ఉద్యోగులు చేసుకున్న బదిలీ దరఖాస్తులను ఈనెల 20వ తేదీలోగా క్లియర్ చేసి వారందరినీ కోరుకున్న జిల్లాలకు బదిలీ చేయాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఈనెల 28వ తేదీలోగా ఆయా శాఖల స్పెషల్ సీఎస్‌లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు ప్రభుత్వానికి ఆదేశించింది.
Next Story