Telugu Global
Telangana

గందరగోళం మధ్యే జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌కు ఆమోదం

మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసానికి పట్టుబట్టిన బీఆర్ఎస్

గందరగోళం మధ్యే జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌కు ఆమోదం
X

బీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారింది. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులు పోటాపోటీ నినాదాలతో సమావేశం దద్దరిల్లింది. సమావేశంలో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మేయర్‌ పోడియాన్ని ముట్టడించడానికి యత్నించారు. వారిని కాంగ్రెస్‌ కార్పొరేటర్లు అడ్డుకొని ప్లకార్డులు చింపివేయడంతో రెండుపార్టీల కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసానికి బీఆర్ఎస్ పట్టుబట్టిందిబీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను మేయర్‌ విజయలక్ష్మి సస్పెండ్‌ చేశారు. దీంతో కౌన్సిల్‌ నుంచి వారిని మార్షల్స్‌ బైటికి తీసుకెళ్లారు. సస్పెండ్‌ చేసిన నలుగురు కార్పొరేటర్లను సభలోకి తీసుకురావాలని బీఆర్‌ఎస్‌ పట్టుబట్టింది. దీంతో మేయర్‌ సమావేశాన్ని వాయిదా వేసింది.గందరగోళం మధ్యనే 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ఆమోదంపై ఈ సమావేశం ఏర్పాటు చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రతన్‌ టాటాకు కౌన్సిల్‌ నివాళులు అర్పించింది. సభలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. చర్చ లేకుండానే బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 8, 440 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.

బీజేపీ కార్పొరేటర్ల భిక్షాటన

బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వచ్చారు. గోషామహల్‌ స్టేడియాన్ని కూల్చవద్దని.. అక్కడ ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించవద్దంటూ వారు నినాదాలు చేశారు. ఉస్మానియ ఆస్పత్రి వెనుక ఉన్న ప్రాంతంలోనే నిర్మించాలని డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశం దృష్ట్యా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

First Published:  30 Jan 2025 12:03 PM IST
Next Story