ఈ రోజు రాత్రి చలితీవ్రత పెరుగుతది!
తెలంగాణ వెదర్ మ్యాన్ అలర్ట్
తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ అలర్ట్ చేశారు. జనవరి నెలలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ రోజు నమోదయ్యే అవకాశముందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. గురువారం తెల్లవారుజామున ఉత్తర హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 5 నుంచి 7 డిగ్రీల మధ్య, పశ్చిమ హైదరాబాద్ లో 7 నుంచి 9 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని.. ఈక్రమంలోనే ఈరోజు ఇంకా ఎక్కువగా టెంపరేచర్ పడిపోతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 14వ తేదీ వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశముందని తెలిపారు. గురు, శుక్రవారాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 7 నుంచి 9 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపారు. చలితీవ్రత పెరుగుతున్నందున ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.