Telugu Global
Telangana

తాండూరు ఎస్టీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌

15 మంది విద్యార్థులకు అస్వస్థత

తాండూరు ఎస్టీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌
X

వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం సాయిపూర్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌తో 15 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఉడకని పురుగుల అన్నం, నీళ్లలాంటి పప్పు తిన్న పలువురు విద్యార్థులు కడుపులో నొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతుండగా హాస్టల్‌ సిబ్బంది తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హాస్టల్‌లో భోజనం సరిగా ఉండటం లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని.. మంచి భోజనం పెట్టాలని అడిగినా వార్డెన్‌, టీచర్లు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు. తాము రాత్రి కూడా అన్నం తినలేదని, ఈరోజు ఆకలితో పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు తెలిపారు.

విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా : మాజీ మంత్రి హరీశ్‌ రావు

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి విగ్రహాలు, ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం మీదున్న ధ్యాస విద్యార్థుల భవిష్యత్‌పై లేదా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కనీసం సొంత జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్‌ ఘటనలు జరిగి విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టని ప్రశ్నించారు. తాండూరు ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌తో 15 మంది విద్యార్థులు ఆస్వస్థతకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం దుర్మార్గమన్నారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న రేవంత్‌ మాటలు నీటి మూటలే అయ్యాయన్నారు. ఇంకెందరు విద్యార్థులు ఆస్పత్రుల పాలు కావాలి? ఎందరు ప్రాణాలు కోల్పోతే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడుతుందని ప్రశ్నించారు.

First Published:  10 Dec 2024 3:47 PM IST
Next Story