Telugu Global
Telangana

పోలీసులు అదుపులో ఎర్రోళ్ల శ్రీనివాస్‌

ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఇంటి వద్ద పోలీసులతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల వాగ్వాదం

పోలీసులు అదుపులో ఎర్రోళ్ల శ్రీనివాస్‌
X

బీఆర్‌ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను మాసబ్‌ట్యాంక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తెరవలేదని పోలీసులు చెబుతున్నారు. విషయం తెలుసుకుని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు.కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణ నెలకొన్నది. ప్రశ్నించే గొంతులను అణిచివేయడానికి రేవంత్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ ఎస్ నేతలు మండిపడ్డారు. దీంతో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ సహా మరికొంతమందిపై గతంలో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు అధికారిగా మాసబ్‌ ట్యాంక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారు.

First Published:  26 Dec 2024 10:35 AM IST
Next Story