Telugu Global
Telangana

శివనామ స్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు

వేములవాడ, కాళేశ్వరం ఆలయాల్లో భక్తుల రద్దీ

శివనామ స్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు
X

మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తార. ముక్కంటికి జలాభిషేకం చేసి పత్రి సమర్పిస్తున్నారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. శివుడి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ఓం నమఃశివాయ్య పంచాక్షరీ మంత్రంతో ఆలయాలు మారుమోగుతున్నాయి.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దర్శనానికి గంటల సమయం పడుతున్నది. ఆలయ అర్చకులు వేకువజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి అద్దాల మండపంలో అనువంశిక అర్చకులతో మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహిస్తారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఘనంగా మహాశిరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి వేయిస్తంభాల గుడిలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరాఉ. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో మహాశివరాత్రి శోభ నెలకొన్నది. కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమం గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్వామివారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో మూడు రోజులపాటు మహాశిరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.

మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా కంఠేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. పాన్‌గల్‌ ఛాయాసోమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వాడపల్లి మీనాక్షి అగసస్త్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చెరవుగట్టు పార్వతీ జడలరామలింగేశ్వరాలయం, పిల్లలమర్రి ఎరకేశ్వర దేవాలయలో పూజలు కొనసాగుతున్నాయి. మేళ్ల చెరువు శంభులింగేశ్వరస్వామి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. యాదగిరిగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని శివాలయాలకు భక్తులు బారులు తీరారు. ఖమ్మం గుంటుమల్లేశ్వరస్వామి, పెనుబల్లి మండలం నీలాద్రి శివాలయం, కూసుమంచిలోని గణేశ్వరుడి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఖమ్మం తీర్థాల త్రివేణి సంగమంలో భక్తుల నదీ స్నానాలు ఆచరించారు. ఈ జాతర మూడు రోజుల పాటు జరగనున్నది.

First Published:  26 Feb 2025 10:34 AM IST
Next Story