Telugu Global
Telangana

ఫార్ములా ఈ-రేసు కేసులో దానకిశోర్‌ వాంగ్మూలం నమోదు

దీని ఆధారంగా కేటీఆర్‌, అర్వింద్‌కుమార్‌లకు నోటీసులు ఇచ్చే అవకాశం

ఫార్ములా ఈ-రేసు కేసులో దానకిశోర్‌ వాంగ్మూలం నమోదు
X

ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఫిర్యాదుదారుడు, మున్సిపల్‌ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. దీని ఆధారంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌, పురపాలక శాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఏసీబీ సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.

ఫార్ములా ఈ-రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ దానకిశోర్‌ ఏసీబీకి ఈ ఏడాది అక్టోబర్‌ 18న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి రూ. 54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా (ఏ1)గా, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ (ఏ2), అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి (ఏ3)గా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.

First Published:  25 Dec 2024 10:53 AM IST
Next Story