Telugu Global
Telangana

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు గెలవరు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని పీసీసీ చీఫ్ వ్యాఖ్యలను ఖండించిన వినోద్‌కుమార్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు గెలవరు
X

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఖండించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలవరని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవన్నారు. గతంలోనూ బీఆర్ఎస్ ఒకసారి పోటీ చేసిన మరోసారి దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఎక్కడైనా ఎన్యుమరేషన్‌ ఎవరు చేస్తారు? ఎన్నికల కమిషన్‌ చేయాలన్నారు. పోటీ చేయాలనుకు అభ్యర్థులు ఓట్లు నమోదు చేయించారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియలోనే చాలా తప్పిదాలున్నాయని అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ కాలం నాటి పద్ధతులే ఇంకా అమలవుతున్నాయి. అందుకే దీనిపై మాపార్టీకి ఒక అభిప్రాయం ఉందన్నారు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు పెట్టినటువంటి ఎన్నికల ప్రక్రియలో చాలా మార్పులు చేయాలన్నారు. ఉపాధ్యాయుడికి రెండు ఓట్లు ఉంటాయి. అదేరోజు అతను టీచర్‌కు, గ్రాడ్యుయేట్‌కు ఓటు వేస్తాడని తెలిపారు. అందుకే ఈ ప్రక్రియపై పెద్ద చర్చ పెట్టాలన్నారు. కానీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ బీఆర్‌ఎస్‌, బీజేపీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయి ఆరోపణలను తప్పుపట్టారు.

First Published:  11 Feb 2025 1:46 PM IST
Next Story