రేషన్ కార్డుల దరఖాస్తులో గందరగోళం
మీ సేవ కేంద్రాలు, సివిల్ సప్లై కార్యాలయం వద్ద భారీగా రద్దీ
![రేషన్ కార్డుల దరఖాస్తులో గందరగోళం రేషన్ కార్డుల దరఖాస్తులో గందరగోళం](https://www.teluguglobal.com/h-upload/2025/02/12/1402727-new-ration-cards.webp)
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు, ఆధార్ అప్‌డేట్ కోసం మీ-సేవ కేంద్రాలకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. కొన్నిచోట్ల స్టాఫ్ లేకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.జనం భారీగా వస్తుండటంతో మీ సేవా కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం 6 నుంచి క్యూలైన్‌లో ఉన్నా పిలవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నామని.. ప్రభుత్వం చెప్పిన ఫీజు కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రద్దీ పెరగడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని మీసేవ నిర్వాహకులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత రసీదును సివిల్ సప్లై ఆఫీసులో ఇవ్వాలని మీ సేవ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో రసీదు తీసుకుని సివిల్ సప్లై కార్యాలయం ముందు ప్రజలు బారులు తీరారు. మీ సేవ కేంద్రాలు, సివిల్ సప్లై కార్యాలయం వద్ద భారీగా రద్దీ పెరిగింది. రెండుచోట్ల గంటల కొద్దీ ఉండాల్సి వస్తుందన్నదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.