Telugu Global
Telangana

సినీ పరిశ్రమపై పగబట్టిన సీఎం రేవంత్‌

అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర ..అల్లు అర్జున్‌ వ్యక్తిత్వ హననం చేసేలా సీఎం వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్‌ ఆరోపణ

సినీ పరిశ్రమపై పగబట్టిన సీఎం రేవంత్‌
X

సినీ పరిశ్రమపై పగబట్టినట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. సంధ్య థియేటర్‌ ఘటనలో మహిళ మృతిని అందరూ ఖండించారన్నారు. శ్రీతేజ్‌ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పారు. మృతురాలి కుటుంబానికి అందరూ బాసటగా నిలిచారన్నారు. ఈ సమస్య ముగిశాక అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించారని.. సినిమా తరహా కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించారని కేంద్ర మంత్రి ఆరోపించారు.

ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేశారు. అల్లు అర్జున్‌ వ్యక్తిత్వ హననం చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్‌ఎస్‌ను ఎంఐఎం నిండా ముంచింది. ఎంఐఎంను నమ్మితే కాంగ్రెస్‌కూ బీఆర్‌ఎస్‌ గతే పడుతుంది. కలుషిత హారం తిని గురుకుల విద్యార్థులు చనిపోతున్నారు. వారి కుటుంబాలను సీఎం ఏనాడైనా పరామర్శించారా? ఆ మరణాలకు మీరు బాధ్యత వహించారా? మీకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? ఇకనైనా రేవంత్‌ కక్ష సాధింపు చర్యలు వీడాలని బండి సంజయ్‌ సూచించారు.

First Published:  22 Dec 2024 1:40 PM IST
Next Story