Telugu Global
Telangana

సీఎం రేవంత్‌రెడ్డి ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన?

మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్అ రెస్టు చేయడం అమానుషమన్న హరీశ్ రావు

సీఎం రేవంత్‌రెడ్డి ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన?
X

ప్రజా పాలన, ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టి, ఇప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం అమానుషమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా, మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ ను అరెస్టు చేయడం అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పిన మీరు కంచెలు, ఆంక్షలు, అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారు.మీ సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అని నిలదీశారు. ప్రొఫెసర్ హరగోపాల్ సహా అరెస్టులు చేసిన ప్రజా సంఘాల నాయకులను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

First Published:  20 Jan 2025 2:02 PM IST
Next Story