కేసీఆర్ ను కలిసి బీఆర్‌ఎస్ విప్ లు
తమకు అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు
BY Naveen Kamera5 Feb 2025 7:08 PM IST
![కేసీఆర్ ను కలిసి బీఆర్‌ఎస్ విప్ లు కేసీఆర్ ను కలిసి బీఆర్‌ఎస్ విప్ లు](https://www.teluguglobal.com/h-upload/2025/02/05/1400655-kcr-wips.webp)
X
Naveen Kamera Updated On: 5 Feb 2025 7:08 PM IST
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను శాసనసభ, శాసన మండలిలో పార్టీ విప్‌లుగా నియమితులైన కేపీ వివేకానంద గౌడ్, సత్యవతి రాథోడ్ కలిశారు. ఎర్రవెల్లిలోని ఫాం హౌస్‌లో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి తమకు పార్టీ విప్‌లుగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని ఘనంగా సత్కరించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో అధికారపక్షం తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని, సభలో పార్టీ సభ్యులు ఆయా చర్చల్లో పాల్గొనేలా చూడాలని కేసీఆర్ కొత్తగా నియామకమైన విప్‌లకు సూచించారు.
Next Story