Telugu Global
Telangana

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్

సర్పంచులకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై సరైన సమాధానం చెప్పని ప్రభుత్వం

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
X

ఆసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సర్పంచులకు పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రానుందన వాకౌట్ చేస్తున్నామని ప్రకటించారు. ప్రతినెల గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీ లకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతోనే బిల్లులు పెరుకుపోయాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సర్పంచులకు రూ.690 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి సీతక్క సమాధానం చెప్పారు. రాష్ట్రంలో బడాబడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు, కానీ సర్పంచులకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. ఏడాది కాలం నుంచి బిల్లులు ఇవ్వకుండా సర్పంచులు, ఎంపీటీసీలను ఈ ప్రభుత్వం గోస గుచ్చుకుంటున్నదని అన్నారు. సర్పంచులు తమ బిల్లుల కోసం గవర్నర్ ను, మంత్రులను కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. బిల్లుల కోసం ఆందోళన చేస్తే ఎక్కడిక్కడ అరెస్టులు చేశారని అన్నారు.కేసీఆర్ పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దారని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. పల్లె ప్రగతికి ప్రతి నెల 275 కోట్లు, పట్టణ ప్రగతి కోసం 150 కోట్లు ఇచ్చామన్నారు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎస్ ఎఫ్ సీ నిధులు విడుదల కావడం లేదని, 15వ ఆర్థిక సంఘం నిధులు డైవర్ట్ చేశారని తెలిపారు. జీపీ ఫండ్ కూడా ఖర్చు పెట్టుకోకుండా చేశారని తెలిపారు. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. అప్పులు చేసి, బంగారం కుదపెట్టి గ్రామ పంచాయతీల్లో పనులు చేశారని తెలిపారు. నవంబర్ ఒక్క నెలలోనే బడా బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్లు విడుదల చేశారని, చిన్న పనులు చేసిన సర్పంచులు ఎంపీటీసీలకు బిల్లులు విడుదల చేయకుండా పగ బట్టారని అన్నారు. వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు.

First Published:  16 Dec 2024 11:28 AM IST
Next Story