Telugu Global
Telangana

ఈ-రేస్ పై చర్చకు బీఆర్ఎస్ పట్టు

అధికార, విపక్షాల వాగ్వాదం.. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి

ఈ-రేస్ పై చర్చకు బీఆర్ఎస్ పట్టు
X

తెలంగాణ శాసనసభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫార్ములా ఈ -రేస్ పై చర్చకు పట్టుబట్టారు. అది ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని స్పీకర్ తెలిపారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంవైపు దూసుకుపోవడానికి ప్రయత్నించగా.. మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చించి విసిరారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న వైపు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేపర్లు చించి విసిరారు. ఒకరిపై ఒకరు పరస్పర నినాదాలు, ఆరోపణలు చేసుకున్నారు. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.

అంతకుముందు మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారు. ఆయనను అప్రతిష్టపాలు చేసి బీఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌ 420 హామీలపై, లగచర్ల అంశంపై, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తుందుకే కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై రకరకాల లీకులు ఇస్తున్నారు. మేం ఎలాంటి తప్పు చేయలేదు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి పార్ములా ఈ- రేస్‌పై నిర్ణయం తీసుకున్నాం. మేం తప్పు చేశామని కాంగ్రెస్‌ వాళ్లు ఆరోపిస్తున్నారు. దీనిపై సభలో చర్చించి ఆ తప్పేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పెట్టింది అక్రమ కేసు కాకుండటే వెంటనే సభలో చర్చించాలి. మేం తప్పు చేయలేదని కేటీఆర్‌ చెప్పారు. ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే సహకరిస్తామన్నారు.

సభ వాయిదా పడ్డాక దీనిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ రేస్ అంశంపై చర్చ పెట్టాలని స్పీకర్ ను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తే.. భూభారతి బిల్లు పై మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. దాని తర్వాత అయినా మాకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశాం. కానీ శాసనసభ జరుగుతుంటే ఒకే ఒక మంత్రి అసెంబ్లీలో ఉన్నారు. మంత్రి బిల్లుపై చదువుకుంటూ వెళ్తున్నారు. ఇది రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ప్రదానమైనటువంటి అంశమైన ఈ రేసింగ్ సబ్జెక్టు పై చర్చ పెట్టాలని కోరామన్నారు.కాంగ్రెస్ వైపు నుంచి దాడి చేయడమే కాకుండా..పేపర్లు విసరడం, చెప్పు తీయడం, బాటిల్ విసిరేయడం జరిగాయన్నారు.కాంగ్రెస్ వాళ్లు అన్ని అంశాలను మాట్లాడుతున్నారని ఫార్ములా ఈ రేస్ పై చర్చకు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు.

First Published:  20 Dec 2024 11:15 AM IST
Next Story