శాసనసభ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు జరపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనను ఎండగట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. లగచర్ల, గురుకులాల అధ్వాన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సాగు సంక్షోభం, 420 హామీలు తదితర ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తామని కేటీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వ వైఖరి వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్న వైనాన్ని తప్పకుండా గుర్తు చేస్తాం, నిలదీస్తామన్నారు. శాసనసభ సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతామని వ్యక్తిగతంగా కాదన్నారు. మా ఇళ్ల ముందు వందల మంది పోలీసు వాళ్లను పెట్టినా పట్టించుకోమన్నారు.
Previous Articleతెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు : ఐఎండీ
Next Article బీఆర్‌ఎస్ పాలనలో సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి
Keep Reading
Add A Comment