అంజనీ కుమార్, అభిలాష బిస్త్ ఏపీకి రిలీవ్
కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి రిలీవ్‌పై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం

ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్‌ను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఏపీలో చేరడానికి వీలుగా వెంటనే రిలీవ్ చేస్తున్నట్లు సీఎస్ శాంతికుమారి జీవోలో పేర్కొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి రిలీవ్‌పై ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. కరీంనగర్‌లో ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నందున అభిషేక్ మహంతి విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఈసీ కోరుటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు.
రహదారి భద్రత అథారిటీ ఛైర్మన్ అంజనీ కుమార్ (1990), తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ (1994), కరీంనగర్ పోలీస్ కమిషన్ అభిషేక్ మహంతి (2011)లు ఏపీకి వెళ్లాలని కేంద్ర హోం శాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ).. రెండు రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారులను కేటాయించింది. దీనిపై కొందరు అధికారులు క్యాట్ను ఆశ్రయించడం. తర్వాత డీవోపీటీ హైకోర్టులో పిటిషన్ వేయడం వంటి పరిణామాలు జరిగాయి. చివరికి 2024లో నియమించిన ఖండేకర్ కమిటీ సిఫార్సు మేరకు ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్‌లను ఏపీలో రిపోర్టు చేయాలని హోం శాఖ ఆదేశించింది.