Telugu Global
Telangana

కిమ్స్‌ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

బాలుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న బన్నీ ఫాదర్‌

కిమ్స్‌ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌
X

సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను సినీ నిర్మాత అల్లు అరవింద్‌ పరామర్శించారు. బాలుడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గత రెండు వారాలుగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే.

శ్రీతేజ్‌ ఆరోగ్యం విషమంగానే ఉన్నదని కిమ్స్‌ డాక్టర్లు చేతన్‌, విష్ణు తేజ్‌లు మంగళవారం రాత్రి విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొన్నారు. ఐసీయూలో వెంటిలేటర్‌పైనే ఉన్నాడని తెలిపారు. మెదడుకు ఆక్సిజన్‌ సరిగా అందడం లేదని, బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ట్యూబ్‌ ద్వారా ఆహారం అందిస్తున్నామన్నారు.

First Published:  18 Dec 2024 4:45 PM IST
Next Story