మిన్నంటిన నిరసనలు…హిజబ్ లు కాల్చేస్తున్నారు, జుత్తును కత్తిరించుకుంటున్నారుSeptember 19, 2022 షరియా చట్టం పేరుతో ఇరాన్ ప్రభుత్వం మహిళలపై అనుసరిస్తున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఇరానీ మహిళ తిరుగబడింది. హిజబ్ సరిగ్గా ధరించనందుకు పోలీసులు అరెస్టు చేసిన ఓ యువతి పోలీసు కస్టడీలో మరణించడంతో ఇరాన్ ఒక్క సారి భగ్గుమంది.