WiFi

వైఫై రూటర్ ఐపీ అడ్రెస్‌ను హ్యాక్ చేయడం ద్వారా ఆ రూటర్‌‌కు కనెక్ట్ అయిన మొబైల్స్‌లోని డేటాను చోరీ చెయొచ్చు లేదా ఆయా మొబైల్స్‌లో బ్రౌజ్ చేస్తున్న ఇంటర్నెట్ వివరాలు, ఎంటర్ చేస్తున్న పాస్‌వర్డ్‌ల వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

ఉన్నట్టుండి వైఫై స్పీడ్ తగ్గిపోతే కనెక్షన్ లోపం అనుకుంటారు చాలామంది. కానీ, వైఫై స్పీడ్ తగ్గడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైంది ఒకే వైఫైని ఎక్కువమంది కనెక్ట్ చేసుకోవడం. కొన్ని యాప్స్ ద్వారా పాస్‌వర్డ్‌ హ్యాక్ చేసి లేదా ఎప్పుడో అడిగి తీసుకుని.. ఇలా చాలామంది మనకు తెలియకుండా వైఫైకు కనెక్ట్ అవుతుంటారు.