#VALUE!,

జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌కు వెళ్లిన బాలిక (17)పై జరిగిన సామూహిక లైంగిక దాడిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సీరియస్ అయ్యారు. బాలికపై జరిగిన దాడిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి సంబంధించిన మీడియా కథనాలను తాను పరిశీలిస్తున్నానని చెప్పారు. రెండు రోజుల్లోగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డికి ఆమె ఆదేశాలు జారీ చేశారు. రేప్ కేసు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాళ్లు […]

ఏపీలో అప్పుడే ఎన్నికల మూడ్ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా.. ముందస్తు ఎన్నికలు వస్తాయేమోననే ఆలోచన అందరిలోనూ ఉన్నది. 2019లో 151 సీట్లు గెలుచుకున్న అధికార వైసీపీ, ఈ సారి అంతకు మించిన సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నది. అందుకే కీలక నేతలను మంత్రి పదవుల నుంచి తప్పించి పార్టీ పదవులు ఇచ్చారు. ఇక అదే సమయంలో టీడీపీ నుంచి పార్టీకి దగ్గర అయిన వారికి కూడా కొన్ని చోట్ల కీలక బాధ్యతలు అప్పగించారు. […]

క్రికెట్ మ్యాచ్ ఓ ఓవర్ ఆరు బాల్స్ లో ఆరు వరుస సిక్సర్లు బాదటం లాంటి రికార్డులు అత్యంత అరుదుగా చోటు చేసుకొంటూ ఉంటాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన క్రికెట్ లో ఇప్పటి వరకూ చేతివేళ్ల మీద లెక్కించదగినంత మంది ఆటగాళ్లు మాత్రమే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన మొనగాళ్లుగా నిలిచారు. ఓవర్లో ఆరు సిక్సర్ల రికార్డును తలచుకోగానే గారీ సోబర్స్, హెర్షల్ గిబ్స్‌ ,యువరాజ్ సింగ్, రవిశాస్త్రి, కీరాన్ పోలార్డ్, లియో కార్టర్ లాంటి […]

హైదరాబాద్ నుంచి గోవాకు ఓ పుట్టిన రోజు వేడుక కోసం బస్సులో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. కర్నాటకలోని కలబురిగి జిల్లా కమలాపుర పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారే కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కర్నాటక అధికారులతో సమన్వయం చేసుకుంటూ […]

ఏపీలో వాతావరణం వేడెక్కింది. గన్నవరంలో అత్యథికంగా 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అత్యథిక ఉష్ణోగ్రత అమరావతి(44.4 డిగ్రీలు)లో నమోదైంది. మొత్తమ్మీద ఏపీలో మరో మూడు రోజులపాటు అత్యథిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. విపత్తు నిర్వహణ సంస్థ కూడా ప్రజలను హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకూడదని హితవుపలికింది. రాబోయే మూడు రోజుల్లో అత్యథిక ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకుంటాయని అంచనా. వేసవి ప్రారంభంలో ఎండలు […]

మండే ఎండల్లో వేడి తాపాన్ని తగ్గించడానికి చల్లని పానీయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగని బయట దొరికే సాఫ్ట్ డ్రింక్స్‌ తాగితే ఉపయోగం లేదు. సమ్మర్ కోసం ఇంట్లోనే చల్లని కూలర్ డ్రింక్స్ తయారుచేసుకోవచ్చు. ఎలాగంటే.. సమ్మర్‌లో కొన్ని డ్రింక్స్‌ను తాగడం వల్ల వేసవి తాపం నుంచి రిలీఫ్ కలగడంతో పాటు శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అలాంటి కొన్ని డ్రింక్స్ ఇప్పుడు చూద్దాం. లైమ్ మింట్ కూలర్ మిక్సీ జార్‌లో కొద్దిగా నిమ్మరసం పిండి, అందులో కొన్ని […]

ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారు చక్కగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండేలా చూడాలని ప్రతి తల్లీతండ్రీ అనుకుంటారు. అందుకోసం చాలా ఓపిగ్గా వారి అల్లరిని భరిస్తుంటారు. ఏడుస్తుంటే బుజ్జగించి ఓదారుస్తుంటారు. రకరకాల కథలు చెబుతూ వారి చిన్ని బొజ్జ నింపాలని చూస్తారు. అయితే కొంతమంది మాత్రం ఇందుకు విరుద్ధంగా… పిల్లలమీద కోపంతో అరిచేస్తుంటారు. తాము చెప్పినట్టు వినకపోతే పిల్లలను కొట్టి తిట్టి భయపెడుతుంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అన్నం […]