గాజాల్లో కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో తమ స్పై చీఫ్ పాల్గొంటారని ఇజ్రాయెల్ ప్రకటన
US
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విజిబిలిటీ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన పీ–8ఏ పొసెడాన్ విమానం అమెరికా నౌకాదళంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.
స్వయంగా పుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి రెండు లక్షల డాలర్ల విలువైన బాండును సమర్పించి బెయిల్ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫాని విల్లీస్ అనుమతించారు.
ఉపాధి కోసం యూఎస్‌కు వెళ్లి అక్కడే శాశ్వతంగా ఉండాలనుకునే వలసదారులకు అమెరికా పర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ (గ్రీన్ కార్డ్)లను ఇస్తుంటుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం.. ప్రతియేటా సుమారు 1,40,000 గ్రీన్ కార్డులను జారీ చేస్తుంది.
”చరిత్రలో అత్యంత క్లిష్టమైన ఈ సమయంలో ప్రపంచ బ్యాంకును నడిపించడానికి అజయ్ బంగా సరైన వ్యక్తి. అతను మూడు దశాబ్దాలకు పైగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు పెట్టుబడులను తీసుకురావడంలో విజయవంతమయ్యాడు. అతనికి వ్యవస్థలను నిర్వహించడంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అంతే కాకుండా ప్రపంచ నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు.” అని జో బైడెన్ పేర్కొన్నారు.
పౌర విమాన రాకపోకలకు కాస్తంత విఘాతం కలిగించేదిగా ఉన్న వస్తువును కూల్చేశామని, శిథిలాలను వెతికే పనిలో ఉన్నామని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ వెల్లడించారు.
రష్యా నుంచి యూరప్ కు వెళ్ళే గ్యాస్ పైప్ లైన్లను కోవర్టు ఆపరేషన్ ద్వారా అమెరికా పేల్చేసిందని ఆధారాలతో సహా బైట పెట్టాడు హెర్ష్.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను వైట్ హౌజ్ ను వీడిపోయేప్పుడు ప్రభుత్వానికి చెందిన పలు కీలక పత్రాలను తనతో పాటు తీసుకెళ్ళాడనే ఆరోపణలున్నాయి. ఫెడరల్ బ్యూరో అధికారులు లోగడ ఆయన ఇంటిపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్లను ట్రంప్ తన ఇంట్లో పత్రికల్లో దాచిపెట్టాడని ఎఫ్బీఐ ఆరోపించింది.
వివాదాలు ఆయన చుట్టూ తిరుగుతాయో ఆయనే వివాదాల చుట్టూ తిరుగుతాడో కానీ టెస్లా కార్లు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో ఉంటాడు. ప్రస్తుతం గూగుల్ కో-ఫౌండర్ సెర్జీ బ్రిన్ భార్య నికోల్ షనాహన్ తో మస్క్ ఎఫైర్ సాగించాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అమెరికాలోని ఇండియానాలో మళ్ళీగన్ గర్జించింది. ఈ రాష్ట్రంలోని గ్రీన్ వుడ్ పార్క్ మాల్ లో నిన్న సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి ఒకరు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. కాల్పులు జరిపిన అగంతకుడిని ఓ యువకుడు కాల్చి చంపాడు.